చికెన్‌ కబాబ్‌

ABN , First Publish Date - 2015-08-30T18:36:29+05:30 IST

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కలు - అరకేజి, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను

చికెన్‌ కబాబ్‌

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్‌ చికెన్‌ ముక్కలు - అరకేజి, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను, కారం - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, చిక్కని పెరుగు - పావు కప్పు, శనగపిండి - 1 టేబుల్‌ స్పూను, నిమ్మరసం - 1 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి, వెల్లుల్లి పొడులు (మార్కెట్లో దొరుకుతాయి) - స్పూను చొప్పున, మిరియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఒక పాత్రలో అల్లవెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలకు బాగా పట్టించి ఒక రాత్రంతా పక్కనుంచాలి. మరో కప్పులో శనగపిండి, నిమ్మరసం, ఉల్లి, వెల్లుల్లి, మిరియాల పొడులు, ఉప్పు కాస్త జారుగా కలిపి మరోసారి చికెన్‌ ముక్కలకు పట్టించి నాలుగు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత ఓవెన్‌లో 400 ఫా. డిగ్రీల ‘ప్రీ’ హీట్‌లో 20 నిమిషాలు ఉంచి తీసేయాలి.

Updated Date - 2015-08-30T18:36:29+05:30 IST