బెంగళూరు వంకాయ పచ్చడి

ABN , First Publish Date - 2015-08-30T20:07:06+05:30 IST

కావలసిన పదార్థాలు: బెంగళూరు వంకాయ పై చెక్కు - 1 కప్పు, వేరుశనగల పప్పు - 2 టేబుల్‌ స్పూన్లు

బెంగళూరు వంకాయ పచ్చడి

కావలసిన పదార్థాలు: బెంగళూరు వంకాయ పై చెక్కు - 1 కప్పు, వేరుశనగల పప్పు - 2 టేబుల్‌ స్పూన్లు, మినప్పప్పు - 1 టేబుల్‌ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, దనియాల పొడి - అర టీ స్పూను, పచ్చిమిర్చి - 2, ఆవాలు - పావు టీ స్పూను, చింతపండు గుజ్జు - 1 టీ స్పూను, బెల్లం - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, పసుపు - చిటికెడు, నూనె - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: అర టీ స్పూను నూనెలో వేరుశనగ, మినప్పప్పు కొద్ది సేపు వేగించి తీసేయాలి. అదే కడాయిలో బెంగళూరు వంకాయ చెక్కు, ఉప్పు, పసుపు వేసి కొద్ది నీరు చిలకరించి మూతపెట్టి మగ్గనివ్వాలి. మిక్సీలో పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, దనియాలపొడి బరకగా తిప్పి, మగ్గిన చెక్కు, చింతపండు గుజ్జు, బెల్లం కలిపి పేస్టులా రుబ్బుకోవాలి. ఇందులో దోరగా వేగించిన తాలింపు కలపాలి. ఈ చట్నీ అన్నంతో పాటు, దోశల్లోకి కూడా బాగుంటుంది.

Updated Date - 2015-08-30T20:07:06+05:30 IST