ఫ్రూట్‌ చాట్‌

ABN , First Publish Date - 2016-01-26T16:38:16+05:30 IST

కావలసిన పదార్థాలు: పైనాపిల్‌ ముక్కలు- రెండు కప్పులు, గ్రీన్‌ యాపిల్స్‌- రెండు, పుచ్చకాయ ముక్కలు- రెండు కప్పులు, పైనాపిల్‌, యాపిల్‌, పుచ్చకాయ జ్యూస్‌లు-

ఫ్రూట్‌ చాట్‌

కావలసిన పదార్థాలు: పైనాపిల్‌ ముక్కలు- రెండు కప్పులు, గ్రీన్‌ యాపిల్స్‌- రెండు, పుచ్చకాయ ముక్కలు- రెండు కప్పులు, పైనాపిల్‌, యాపిల్‌, పుచ్చకాయ జ్యూస్‌లు- అరలీటరు చొప్పున, జీలకర్ర- టేబుల్‌ స్పూన్‌, చాట్‌ మసాలా, ఉప్పు, నిమ్మరసం- తగినంత
తయారీ విధానం: పైనాపిల్‌, యాపిల్‌, పుచ్చకాయ జ్యూస్‌లను వేరువేరుగా మూడు గిన్నెల్లో పోయాలి. వీటిల్లో జీలకర్ర, చాట్‌మసాలా, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఫ్రిజ్‌లో పెట్టాలి. మూడు గంటల తరువాత తీసి పండ్ల ముక్కలపై పోయాలి. దీనిపై పుదీనా తరుగు చల్లుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2016-01-26T16:38:16+05:30 IST