Abn logo

మటన్‌ కుర్మా

an style="color: red;">కావలసిన పదార్థాలు: నూనె- అరకప్పు, ఉల్లిపాయ (తరిగి)- ఒకటి, మటన్‌- ముప్పావు కేజీ, పెరుగు- నాలుగు టీస్పూన్లు, నీళ్లు- ఒక కప్పు, ధనియాల పొడి- రెండు టీస్పూన్లు, కారం- ఒక టీస్పూను, ఉప్పు- తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టీస్పూన్లు, లవంగాలు- నాలుగు, యాలకలు- రెండు, దాల్చినచెక్క- మూడు అంగుళాలు, వేగించిన ఉల్లిపాయ ముక్కలు- రెండు టీస్పూన్లు.
తయారీ విధానం: ఒక గిన్నెలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అవి వేగిన తరువాత మటన్‌, పెరుగు, ఉప్పు, నీళ్లు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. కొద్దిసేపటి తరువాత అల్లంవెల్లుల్లి పేస్టు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు వేసి సన్నటి మంటపై అరగంట ఉడికించాలి. తరువాత వేగించుకున్న ఉల్లిపాయలు వేసి మటన్‌ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. దీన్ని చపాతీ, రోటీలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

అమాత్యా.. మాస్కులు మరిచితిరా?!వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషిఅభివృద్ధి పనులపై పెత్తనంపాతాళంలో విషం..!వట్టివాగు ప్రాజెక్టు కుడికాలువ గండి పూడ్చేదెన్నడు?ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలిపెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని ధర్నాకేజీబీవీలో మెనూపై గ్రంథాలయ చైర్మన్‌ ఆగ్రహంక్రాస్‌ కంట్రీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులుయాసంగిలో పప్పుదినుసు పంటలు వేయాలి
Advertisement