Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్ర్టాబెరీ కేక్‌

కావలసినవి: మైదా 220 గ్రా., పంచదార 160 గ్రా., నూనె 140 మి.లీ, చిక్కటి పెరుగు 100గ్రా, బేకింగ్‌పౌడర్‌ ఒకటింబావు స్పూన్‌, తాజా క్రీం 200 మి.గ్రా., స్ర్టాబెరీ సాస్‌ మూడు టీ స్పూన్‌లు, ఐసింగ్‌ షుగర్‌ రెండు లేదా మూడు టీ స్పూన్‌లు, అలంకరణకి తగినన్ని స్ర్టాబెరీలు ...
తయారీ విధానం
మైదాను జల్లించి బేకింగ్‌పౌడర్‌ని కలిపి పక్కనుంచుకోవాలి. పంచదారను మెత్తగా పొడిచేసుకుని అందులోనే నూనె, పెరుగువేసి మళ్లీ గ్రైండ్‌ చేయండి. మృదువుగా తయారయిన ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో స్ర్టాబెరీ సాస్‌ని వేసి బాగా కలపండి. తర్వాత మైదాని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపండి. నూనె రాసి ఉంచుకున్న బేకింగ్‌డిష్‌లో ఈ మిశ్రమాన్ని పోయండి.180 డిగ్రీల దగ్గర వేడి చేసి ఉంచుకున్న ఒవెన్‌లో ఈ డిష్‌ని ఇరవై నిమిషాల సేపు ఉంచండి. తరువాత ఒవెన్‌ వేడి తగ్గించి మరో పదినిమిషాలు ఉంచి తీసి చల్లారిన తరువాత ఐసింగ్‌, స్ర్టాబెర్రీలతో అలంకరించండి. ఒవెన్‌ లేని వాళ్లు ఈ కేక్‌ని కుక్కర్‌లో అయినా తయారు చేసుకోవచ్చు.

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రా‘ఫికర్‌’ఘనంగా సంక్రాంతి వేడుకలుక్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందిఉపాధ్యాయులకు బదిలీలు సహజంకోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులుఅసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు సన్మానం పండుగ పూట విషాదంఏఐటీయూసీ సమావేశాలను విజయవంతం చేయండిప్రభుత్వం రైతులను ఆదుకోవాలి అభివృద్ధికి నోచుకోని గ్రంథాలయాలు
Advertisement