ఆలూ నూడిల్స్‌ కట్‌లెట్‌

ABN , First Publish Date - 2018-09-12T22:59:08+05:30 IST

ఆలు(బంగాళాదుంపలు): ఆరు(మీడియం సైజువి), ఇన్‌స్టంట్‌ నూడిల్స్‌: ఒక పాకెట్‌, కొత్తిమీర: కొద్దిగా...

ఆలూ నూడిల్స్‌ కట్‌లెట్‌

కావలసిన పదార్ధాలు
 
ఆలు(బంగాళాదుంపలు): ఆరు(మీడియం సైజువి), ఇన్‌స్టంట్‌ నూడిల్స్‌: ఒక పాకెట్‌, కొత్తిమీర: కొద్దిగా, మైదా: వందగ్రాములు, పచ్చిమిరపకాయలు: నాలుగు లేదా ఐదు(ముక్కలుగా చేసుకోవాలి), నూనె: వేయించడానికి తగినంత, ఉప్పు: రుచికి సరిపడ
 
తయారీ విధానం
ముందుగా బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి చేతితో మెదిపి అందులో ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీక వేసి ముద్దలాగా చేసుకుని కట్‌లెట్‌లు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూడిల్స్‌ నీటిలో ఉడికించి పిండిపక్కన పెట్టుకోవాలి. మైదాలో నీరు పోసి గంటెజారుగా తడుపుకోవాలి. ఈ మైదాపిండిలో రెడీ చేసుకన్న కట్‌లెట్‌లు ముంచి, నూడిల్స్‌లో దొర్లించుకోవాలి. కట్‌లెట్స్‌ అన్నీ ఇలా చేసుకున్న తరువాత బాండీలో నూనె పోసుకుని కాగిన తరువాత వీటిని దోరగా వేయించుకోవాలి. సాయంత్రం స్నాక్స్‌కి ఇవి రుచిగా ఉంటాయి.

Updated Date - 2018-09-12T22:59:08+05:30 IST