ఆలూ పకోడి

ABN , First Publish Date - 2018-09-12T23:00:31+05:30 IST

మైదా: కప్పు, బియ్యంపిండి: కప్పు, ఆలుగడ్డలు: మూడు, కారం: స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద...

ఆలూ పకోడి

కావలసిన పదార్థాలు
 
మైదా: కప్పు, బియ్యంపిండి: కప్పు, ఆలుగడ్డలు: మూడు, కారం: స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద: స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: వేయించడానికి తగినంత
 
తయారీ విధానం
 
ఆలుగడ్డలను మెత్తగా ఉడికించుకుని చేతితో మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో మైదా, బియ్యంపిండి, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసి పకోడి పిండిలాగా చేసుకోవాలి. నూనె కాగిన తరువాత వీటిని కావలసిన సైజులో వేసి దోరగా వేయించుకోవాలి.

Updated Date - 2018-09-12T23:00:31+05:30 IST