ఎగ్‌ ఛాట్‌

ABN , First Publish Date - 2018-10-19T15:43:21+05:30 IST

ఉడికించిన గుడ్లు: రెండు, ఉల్లిపాయ: ఒకటి(సన్నగా తరుక్కోవాలి), ఖీరా:సగం(సన్నగా తురుముకోవాలి), పచ్చిమిరపకాయలు....

ఎగ్‌ ఛాట్‌

కావలసిన పదార్థాలు
 
ఉడికించిన గుడ్లు: రెండు, ఉల్లిపాయ: ఒకటి(సన్నగా తరుక్కోవాలి), ఖీరా:సగం(సన్నగా తురుముకోవాలి), పచ్చిమిరపకాయలు: రెండు(ముక్కలు చేసుకోవాలి), పుదీనా, కొత్తిమీర: కొద్దిగా, ఛాట్‌ మసాలా: టేబుల్‌ స్పూను, జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, ఎర్ర కాప్సికమ్‌: ఒకటి(చిన్నగా ముక్కలు చేసుకోవాలి), గ్రీన్‌ చట్నీ: రెండు స్పూన్లు.
 
తయారీ విధానం
 
గిన్నెలో ఉల్లిపాయలు, ఖీరా, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఛాట్‌ మసాలాచ జీలకర్ర, ఉప్పు, ఎర్ర కాప్సికమ్‌ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గుడ్లను సన్నగా పొడవుగా ముక్కలు చేసుకొని ఈ మిశ్రమానికి కలుపుకోవాలి. సర్వ్‌ చేసే ముందు గ్రీన్‌ చట్నీ యాడ్‌ చేసుకోవాలి.

Updated Date - 2018-10-19T15:43:21+05:30 IST