కాలీఫ్లవర్‌ కోకోనట్‌ బాల్స్‌

ABN , First Publish Date - 2018-10-19T15:42:00+05:30 IST

కాలీఫ్లవర్‌ ముక్కలు: రెండు కప్పులు, తాజా కొబ్బరి తురుము: కప్పు, శనగపిండి: కప్పు, జీలకర్ర...

కాలీఫ్లవర్‌ కోకోనట్‌ బాల్స్‌

కావలసిన పదార్థాలు
 
కాలీఫ్లవర్‌ ముక్కలు: రెండు కప్పులు, తాజా కొబ్బరి తురుము: కప్పు, శనగపిండి: కప్పు, జీలకర్ర పొడి: టేబుల్‌ స్పూను, కారం: సరిపడ, నిమ్మరసం: మూడు స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడ, ఉప్పు: రుచికి సరిపడ, ఆమెచ్యూర్‌ పొడి: టేబుల్‌ స్పూను, కొత్తిమీర: కొద్దిగా.
 
తయారీ విధానం
 
నూనె తప్ప మిగతా అన్ని పదార్థాలు ఒక గిన్నెలో వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. బాండీలో నూనెపోసి కాగిన తరువాత ఈ పిండి బాల్స్‌లాగా చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది సాయంకాలం టిఫిన్‌గా బాగుంటుంది.

Updated Date - 2018-10-19T15:42:00+05:30 IST