కట్టో మీటో కైమా

ABN , First Publish Date - 2015-08-31T17:14:20+05:30 IST

కావలసినవి: మటన్‌ కైమా 500 గ్రా, సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు, రెండు పెద్ద టమోటాలు

కట్టో మీటో కైమా

కావలసినవి: మటన్‌ కైమా 500 గ్రా, సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలు, రెండు పెద్ద టమోటాలు (సన్నగా కోసుకోవచ్చు లేదా గుజ్జుగా చేసుకోవచ్చు), ఆలుగడ్డలు రెండు (తొక్కుతీసి కడిగి సన్నగా కోసుకోవాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్‌ ఒక టేబుల్‌ స్పూను, పసుపు కొద్దిగా, కారం ఒక టేబుల్‌ స్పూన్‌, సాంబారు మసాలా ఒక టీస్పూను, వినెగర్‌ ఒక టేబుల్‌ స్పూన్‌, బెల్లం చిన్నగడ్డ, నూనె రెండు టేబుల్‌ స్పూనులు, ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
కైమా బాగా కడిగి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ కలిపి అరగంటసేపు పక్కన పెట్టేయండి. గిన్నెలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు వేగాక అన్ని మసాలా పొడులు కలిపి ఇంకో నిమిషం, రెండు నిమిషాలు వేగించండి. తర్వాత కైమా, ఉప్పు, టమోటాలు వేసి సన్నసెగ మీద ఉడికించండి లేదా కుక్కర్‌లో పెట్టండి. కైమా ఉడికాక ఆలుముక్కలు వేసి అవీ ఉడికాక వినెగర్‌, బెల్లం కలపండి. బెల్లం కరిగాక దింపేసి వేడివేడిగా వడ్డించండి. బ్రెడ్‌, చపాతీ, కిచడీలలో దేనితో కలిపి తిన్నా బాగుంటుంది.

Updated Date - 2015-08-31T17:14:20+05:30 IST