మునక్కాడ ఆవకాయ

ABN , First Publish Date - 2015-09-02T15:42:45+05:30 IST

కావలసిన పదార్థాలు: మునక్కాడలు - రెండు, ఆవపిండి - నాలుగు టీస్పూన్లు, జీలకర్ర - అర టీస్పూను

మునక్కాడ ఆవకాయ

కావలసిన పదార్థాలు: మునక్కాడలు - రెండు, ఆవపిండి - నాలుగు టీస్పూన్లు, జీలకర్ర - అర టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, కారం - మూడు టీస్పూన్లు, ఉప్పు - రెండు టీస్పూన్లు, పసుపు - చిటికెడు, ఉడికించిన చింతపండు గుజ్జు - ఒక టీస్పూను, జీలకర్ర, మెంతుల పొడి - ఒక టీస్పూను, నూనె - ఒక కప్పు.
తయారుచేసే విధానం: కడాయిలో కప్పు నూనె పోసి కాగాక అందులో జీలకర్ర, తరిగిన మునక్కాడ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉప్పు, పసుపు, చింత పండు గుజ్జు వేసి దోరగా వేగాక దింపుకోవాలి. ఈ మిశ్రమం కాస్త చల్లారాక అందులో కారం, జీలకర్ర, మెంతుల పొడి, ఆవాల పొడి కలిపి ఒక పూట ఊరబెట్టి తినవచ్చు.

Updated Date - 2015-09-02T15:42:45+05:30 IST