నువ్వుపిండి ఆవకాయ

ABN , First Publish Date - 2015-09-02T15:55:17+05:30 IST

కావలసిన పదార్థాలు: మామిడికాయలు - 12, కారం - అరకేజి, ఉప్పు (మెత్తనిది) - అరకేజి

నువ్వుపిండి ఆవకాయ

కావలసిన పదార్థాలు: మామిడికాయలు - 12, కారం - అరకేజి, ఉప్పు (మెత్తనిది) - అరకేజి, నూనె - ముప్పావుకేజి, వేగించిన నువ్వు (పప్పు) పిండి - అరకేజి.
తయారుచేసే విధానం: మామిడికాయల్ని (చెక్కుతోపాటే) ముక్కలుగా తరుక్కోవాలి. ఒక పాత్రలో నువ్వుపిండి, కారం, ఉప్పు కలపాలి. ఇందులో ముక్కల్ని వేసి మిశ్రమం బాగా పట్టేలా కలపాలి. తర్వాత కాచి చల్లార్చిన నూనె వేసి జాడీకెత్తుకోవాలి. రుచిగా ఉందని నువ్వుపిండి ఆవకాయను మరీ ఎక్కువగా తినకుండా మోతాదుగా ఆస్వాదించాలి.

Updated Date - 2015-09-02T15:55:17+05:30 IST