అత్తిపళ్ల కేక్‌

ABN , First Publish Date - 2015-08-29T22:42:35+05:30 IST

కావలసిన పదార్థాలు: అత్తిపళ్లు - 4 (అర ముక్కలుగా కట్‌ చేయాలి), బటర్‌ - అరకప్పు, పంచదార పొడి - 2 కప్పులు

అత్తిపళ్ల కేక్‌

కావలసిన పదార్థాలు: అత్తిపళ్లు - 4 (అర ముక్కలుగా కట్‌ చేయాలి), బటర్‌ - అరకప్పు, పంచదార పొడి - 2 కప్పులు, గుడ్లు - 4, మైదా - 1 కప్పు, బేకింగ్‌ పౌడర్‌ - అర టీ స్పూను, బాదం (చిన్న పలుకులు) - అర కప్పు, దాల్చినచెక్క పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: 8 అంగుళాల చుట్టుకొలత ఉన్న టిన్‌ అడుగున వెన్నరాసి, అక్కడక్కడ అత్తిపళ్లను బోర్లించాలి. వేరే గిన్నె తీసుకుని బటర్‌, పంచదార, గుడ్లు, బేకింగ్‌ పౌడర్‌, బాదం పలుకులు, దాల్చినచెక్కపొడి అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని అత్తిపళ్ల టిన్‌లో పోసి 350 డిగ్రీల వద్ద ‘ప్రీ హీట్‌’ చేసుకున్న ఓవెన్‌లో గంటసేపు ఉంచాలి. టూత్‌పిక్‌తో చెక్‌ చేసుకుని, చల్లారిన తర్వాత బోర్లించి ముక్కలు కట్‌ చేసుకోవాలి. (ఓవెన్‌ లేనివాళ్లు కేక్‌పాన్‌లో కూడా చేసుకోవచ్చు)జీఞ, ఛ్ఛీజజ్చ్ట్ఛూ
అఛిషల

Updated Date - 2015-08-29T22:42:35+05:30 IST