మటర్‌ మష్రూమ్‌

ABN , First Publish Date - 2015-08-31T22:16:08+05:30 IST

కావలసిన పదార్థాలు: మష్రూమ్స్‌ - 200 గ్రా., పచ్చిబఠాణి - ఒకటిన్నర కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, యాలకులు

మటర్‌ మష్రూమ్‌

కావలసిన పదార్థాలు: మష్రూమ్స్‌ - 200 గ్రా., పచ్చిబఠాణి - ఒకటిన్నర కప్పు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, యాలకులు - 4, కరివేపాకు - 4 రెబ్బలు, దాల్చినచెక్క - అంగుళం ముక్క, (తరిగిన) ఉల్లిపాయలు - 2, అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు, టమోటా గుజ్జు - అరకప్పు, కారం - 1 టీ స్పూను, దనియాలపొడి - 1 టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, గరం మసాల - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, జీడిపప్పు పేస్టు - అరకప్పు.
తయారుచేసే విధానం: శుభ్రం చేసిన మష్రూమ్స్‌ని 4 ముక్కలుగా కట్‌ చేయాలి. నూనెలో యాలకులు, దాల్చినచెక్క, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. టమోటా గుజ్జు, దనియాలపొడి, పసుపు, గరం మసాల, ఉప్పు వేసి 3 నిమిషాల తర్వాత (కప్పు నీటిలో కరిగించిన) జీడిపప్పు పేస్టుతో పాటు మరో కప్పు నీరు కలపాలి. మరుగుతున్నప్పుడు పచ్చిబఠాణి, మష్రూమ్‌ ముక్కలు వేసి చిన్న మంటపై చిక్కబడ్డాక దించేయాలి. ఈ కర్రీ నాన్‌, పరాటలతో బాగుంటుంది.

Updated Date - 2015-08-31T22:16:08+05:30 IST