బొప్పాయికూటు

ABN , First Publish Date - 2018-03-24T22:28:01+05:30 IST

పచ్చిబొప్పాయి ముక్కలు - 2, కప్పులు, పెసరపప్పు - 1/2 కప్పు, టమాటా ముక్కలు - 1/2 కప్పు, పచ్చిమిర్చి

బొప్పాయికూటు

కావలసిన పదార్థాలు
 
పచ్చిబొప్పాయి ముక్కలు - 2, కప్పులు, పెసరపప్పు - 1/2 కప్పు, టమాటా ముక్కలు - 1/2 కప్పు, పచ్చిమిర్చి - 2, పసుపు- చిటికెడు, పచ్చికొబ్బరి తురుము - 1/4 కప్పు, జీలకర్ర - 1/2 స్పూను, ఎండు మిర్చి - 1, నూనె - 3 టీ స్పూన్లు, మినప్పప్పు - 1 స్పూను, ఉల్లిపాయ - 1, ఆవాలు - 1/4 స్పూను, ఇంగువ - చిటికెడు, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర - తగినంత.
 
తయారుచేసే విధానం
 
ముందుగా కొబ్బరి తురుము, ఎండుమిర్చి, జీలకర్ర కొద్దిగా నీళ్లు పోసి పేస్టు చేసి పెట్టుకోండి. ప్రెషర్‌ కుక్కర్లో బొప్పాయి ముక్కలు, పెసరపప్పు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి ఒక కప్పు నీళ్లు పోసి రెండు మూడు విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించండి. తర్వాత ముందుగా పేస్ట్‌ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని, ఉప్పును కలిపి మరొక రెండు నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు విడిగా పాన్‌లో నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, కరివేపాకుతో తాలింపుపెట్టండి. దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేగించండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ప్రెషర్‌ కుక్కర్లోని మిశ్రమాన్ని కలిపి రెండు నిమిషాల తర్వాత స్టవ్‌ ఆపి తరిగిన కొత్తిమీర చల్లండి. దీనిని చపాతీతో కానీ, రైస్‌తో కానీ తీసుకుంటే బాగుంటుంది.

Updated Date - 2018-03-24T22:28:01+05:30 IST