మటన్‌ దోసకాయ

ABN , First Publish Date - 2015-08-31T22:17:15+05:30 IST

కావలసిన పదార్థాలు: మటన్‌ - అర కేజీ, దోస ముక్కలు - 2 కప్పులు, ఉల్లిపాయ తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి - 2

మటన్‌ దోసకాయ

కావలసిన పదార్థాలు: మటన్‌ - అర కేజీ, దోస ముక్కలు - 2 కప్పులు, ఉల్లిపాయ తరుగు - అర కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, దనియాలపొడి - 1 టీ స్పూను, పసుపు - చిటికెడు, కారం - 2 టీ స్పూన్లు, గరం మసాల - పావు టీ స్పూను, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం: కుక్కర్లో ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. పసుపు, కారం, ఉప్పు, దనియాలపొడి వేసి నిమిషం తర్వాత మటన్‌ ముక్కలు కలిపి నీరు ఇగిరిపోయేదాకా సన్నని సెగమీద ఉంచాలి. తర్వాత అరకప్పు నీరు పోసి 3 విజిల్స్‌ వచ్చేవరకు ఉడికించాలి. (స్టౌవ్‌ ఆపేసి, కుక్కర్‌ చల్లబడ్డాక) దోసకాయ ముక్కలు వేసి మరో విజిల్‌ వచ్చేవరకు ఉంచి గరం మసాల, కొత్తిమీర తరుగు చల్లాలి. ఈ కూర అన్నంతోనూ, పరాటాలతోనూ బాగుంటుంది.

Updated Date - 2015-08-31T22:17:15+05:30 IST