రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-01T06:10:54+05:30 IST

కేంద్రప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ఏకపక్షంగా ఆమోదించిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీలో గత నాలుగు రోజులుగా లక్షలాది రైతులు చేపట్టిన నిరసన డిమాండ్లను పరిష్కరించాలని దేశవ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు వామపక్ష పార్టీలు ధర్నా చేపట్టారు.

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి

కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నాలో వామపక్ష పార్టీలు

నిర్మల్‌ టౌన్‌, నవంబరు : కేంద్రప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ఏకపక్షంగా ఆమోదించిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీలో గత నాలుగు రోజులుగా లక్షలాది రైతులు చేపట్టిన నిరసన డిమాండ్లను పరిష్కరించాలని దేశవ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు వామపక్ష పార్టీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.విలాస్‌ మాట్లాడుతూ కోవిడ్‌ పరిస్థితులను ఆసరాగా తీసుకుని, ప్రతిపక్షాలు లేకుండా, ఎలాంటి చర్చ చేపట్టకుండా 3 రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదింపజేయడం రైతు వ్యతిరేక చర్య అన్నారు. రైతులు ఆరుగాలం శ్రమటోడ్చి పండించిన పంటలను పెట్టుబడి దారులకు దోచి పెట్టడమే లక్ష్యమన్నారు. మార్కెట్‌ కమిటీల్లో పని చేస్తున్న లక్షలాది కార్మికుల పొట్టకొట్టే చర్య ని గత 4 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో కోటి ఇరవై లక్షల మంది నిర్వహి స్తున్న ధర్నాను చూసైనా ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు రైతులకు అండగా ఉండి పోరాడతామన్నారు. ఈ ధర్నాలో సీపీఐ ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శి కుంటాల రాములు, సీపీఐ ఎంఎల్‌ నాయకులు కే. రాజన్న, పట్టణ కార్యదర్శి జిఎస్‌ నారాయణ, సహయ కార్యదర్శి శంకర్‌, వామపక్ష నాయకులు పి. సత్యనారాయణ, అఫ్జల్‌, ఏసీ లక్ష్మణ్‌, అబ్దుల్లా, గంగాధర్‌, పుండలిక్‌, భుక్య విలాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T06:10:54+05:30 IST