Abn logo
Sep 21 2021 @ 23:31PM

డిగ్రీలో మాతృభాష రద్దు సరికాదు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ధర్నాచేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు :


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: డిగ్రీలో తెలుగు మీడియంను రద్దు చేస్తూ ప్రభు త్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు పులిరాజు, జిల్లా కన్వీనర్‌ వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ.. జాతీయ కొత్తవిద్యా విధానంలో భాగంగా ఇం జనీరింగ్‌ వంటి కోర్సులను కూడా ప్రాంతీయ భాషల్లో బోధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇంగ్లిషు మీడియానికి తాము వ్యతిరేకం కాదని.. అయితే, తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం చదవాలనుకునే విద్యార్థులకు అవకాశం లేకపోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. తక్షణమే తెలుగు మీడియం కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ పీజీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వర్తించదని జీవో నంబర్‌ 77 తీసుకువచ్చి పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయడం అన్యాయ మన్నారు. వెంటనే ఈ జీవోని రద్దుచేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సంఘటన కార్యదర్శి శ్రీకాంత్‌, నాయకులు సాయిలక్ష్మి, అరుణ్‌కుమార్‌, రాజేష్‌, లోకేష్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.