వ్యాక్సినేషన్‌ గురించి మోదీ బొమ్మలతో ప్రచారం

ABN , First Publish Date - 2021-06-23T09:54:04+05:30 IST

దేశంలో పద్దెనిమిదేళ్లు దాటినవారందరికీ ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ హోర్డింగులు, బ్యానర్లు పెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కార్యదర్శి రజనీష్‌ జైన్‌..

వ్యాక్సినేషన్‌ గురించి మోదీ బొమ్మలతో ప్రచారం

యూనివర్సిటీలకు సూచించిన యూజీసీ


న్యూఢిల్లీ, జూన్‌ 22: దేశంలో పద్దెనిమిదేళ్లు దాటినవారందరికీ ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ హోర్డింగులు, బ్యానర్లు పెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కార్యదర్శి రజనీష్‌ జైన్‌ దేశంలోని అన్ని వర్సిటీలు, కాలేజీలు, సాంకేతిక విద్యాసంస్థలకు వాట్సాప్‌ సందేశం పంపారు! ఆయా సంస్థ సోషల్‌ మీడియా పేజీల్లో సైతం మోదీకి కృతజ్ఞతలు తెలిపే బ్యానర్లను షేర్‌ చేయాలని కూడా సూచించారు. ఆయా బ్యానర్లు రూపొందించాల్సిన శ్రమ కూడా విద్యాసంస్థలకు లేకుండా.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ  ‘థాంక్యూ పీఎం మోదీ’, ‘వ్యాక్సిన్‌ ఫర్‌ ఆల్‌ (అందరికీ టీకాలు)’, ‘ఫ్రీ ఫర్‌ ఆల్‌ (అందరికీ ఉచితం)’ అనే నినాదాలతో హిందీ, ఇంగ్లి్‌షలో రూపొందించిన డిజైన్లను జత చేశారు. 

Updated Date - 2021-06-23T09:54:04+05:30 IST