ఎనిమిది నగరాల్లో... విక్రయం కాని గ‌ృహాలు ఏడు లక్షలకు పైమాటే...

ABN , First Publish Date - 2021-01-13T20:54:36+05:30 IST

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు(ఇన్వెంటరీ) తొమ్మది శాతం మేర తగ్గి... 7.18 లక్షలకు చేరాయి. ఇందులో 48 శాతం అఫర్డబుల్‌ విభాగంలోని గృహాలు కాగా, మరో ఎనిమిది శాతం రెడీ టు మూవ్‌ హోమ్స్‌ ఉన్నాయని ప్రాప్‌టైగర్‌ వెల్లడించింది.

ఎనిమిది నగరాల్లో... విక్రయం కాని గ‌ృహాలు ఏడు లక్షలకు పైమాటే...

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు(ఇన్వెంటరీ) తొమ్మది శాతం మేర తగ్గి... 7.18 లక్షలకు చేరాయి. ఇందులో 48 శాతం అఫర్డబుల్‌ విభాగంలోని గృహాలు కాగా, మరో ఎనిమిది శాతం రెడీ టు మూవ్‌ హోమ్స్‌ ఉన్నాయని ప్రాప్‌టైగర్‌ వెల్లడించింది.  ‘రియల్‌ ఇన్‌సైట్స్‌ క్యూ–2020’ నివేదిక మేరకు...  2019 డిసెంబరు నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 7.92 లక్షల ఇన్వెంటరీ ఉండగా, గతేడాది డిసెంబరు31 నాటికి 7.18 లక్షలకు తగ్గాయి.


ఇక 2019 లో ఇన్వెంటరీ విక్రయానికి 27 నెలల సమయం పట్టగా... ఇప్పుడవి 47 నెలలకు పెరిగిందని తెలిపింది. హైదరాబాద్‌లో 39,308 గృహాల ఇన్వెంటరీ ఉంది. ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌(ఎంఎంఆర్‌)లో 2,67,987, పుణేలో 1,21,868, ఎన్‌సీఆర్‌లో 1,06,689, బెంగళూరులో 71,198, అహ్మదాబాద్‌లో 38,614, చెన్నైలో 36,609, కోల్‌కతాలో 30,210 గృహాలున్నాయి. 

Updated Date - 2021-01-13T20:54:36+05:30 IST