ఆ సాఫ్ట్ ఎంఎన్‌సీల్లో... లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు...

ABN , First Publish Date - 2021-07-20T21:06:31+05:30 IST

రానున్న సంవత్సర కాలంలో... కొత్తగా 20-22 వేల మందిని ఉద్యోగాల్లో తీసుకోనున్నట్లు హెచ్‌సీఎల్ వెల్లడించింది.

ఆ సాఫ్ట్ ఎంఎన్‌సీల్లో... లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు...

బెంగళూరు : రానున్న సంవత్సర కాలంలో... కొత్తగా 20-22 వేల మందిని ఉద్యోగాల్లో తీసుకోనున్నట్లు హెచ్‌సీఎల్ వెల్లడించింది. సెప్టెంబరు త్రైమాసికంలో ఆరు వేల మంది కొత్తవారిని నియమించుకుంటున్నట్లు తెలిపింది. కాగా... హెచ్‌సీఎల్ టెక్ రూ. 2 ముఖవిలువ కలిగిన ఒక్కో షేర్‌కు 300 శాతం మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని కంపెనీ బోర్డ్ నిర్ణయించింది. డివిడెండ్ చెల్లింపులకు జూలై 28 ని రికార్డ్ తేదీగా నిర్ణయించారు.


హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగుల సంఖ్య 2021 జూన్ త్రైమాసికం చివరి నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1.76 లక్షల పైచిలుకే. ఇక ఉద్యోగ వలసల రేటు 11.8 శాతంగా నమోదైంది. ఇక... ఐబీఎం ఇండియా మాజీ ఎండీ, చైర్మన్ వనితా నారాయణ్‌ను అదనపు డైరెక్టర్‌గాహెచ్‌సీఎల్ టెక్ బోర్డులోకి తీసుకున్నారు. ఈమె స్వతంత్ర డైరెక్టర్ హోదాలో కొనసాగనున్నారు. ఈమే ఎక్స్చేంజీలకు కంపెనీ సమాచారమిచ్చింది. 

Updated Date - 2021-07-20T21:06:31+05:30 IST