Abn logo
Sep 26 2021 @ 20:50PM

ఈ మరణ ధృవీకరణ పత్రం విలువ 3.14కోట్లు! దీని ప్రత్యేకత ఏంటో తెలిస్తే..

వాషింగ్టన్: అబ్రహాం లింకన్.. ఆధునిక అమెరికాకు తుది రూపు ఇచ్చిన మహోన్నత నేత! ఆయన అస్తమించి దశాబ్దాలు గుడుస్తున్నా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ పేరు చెప్పగానే అమెరికన్లు పులకించిపోతారు. ఆయన ఉపయోగించిన వస్తువులను చూడాలని, వీలైతే సొంతం చేసుకుని, ఆయన గుర్తులను తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని పరితపిస్తారు. ఈ నేపథ్యంలో..అబ్రహాం లింకన్ మరణ ధృవీకరణ పత్రం(డెత్ సర్టిఫికేట్) తాజాగా వేలానికి వచ్చింది. దీని ప్రారంభ ధర 4,25,000 డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..రూ. 3.14 కోట్లు! వేలం ముగిసే సమయానికి దీని ధర ఎంతకు చేరుకుంటుందో అనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. 

 దాదాపు 35 ఏళ్ల క్రితం ఈ మరణ ధృవీకరణ పత్రాన్ని ఓ ప్రైవేటు కలెక్టర్ సొంతం చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు ఇది వేలానికి వచ్చింది. ఈ సర్టిఫికేట్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. అబ్రహాం లింకన్‌‌కు చెందిన ఎస్టేట్ విలువ కూడా ఇందులో నమోదైంది. అప్పట్లో ఆయన ఎస్టేట్ విలువ 85 వేల డాలర్లట. నేటి పరిస్థితుల ప్రకారం.. ఇది 1.42 మిలియన్ డాలర్లు. అబ్రహాం లింకన్ పార్థివ దేహాన్ని తీసుకునే క్రమంలో ఆయన ప్రాణ స్నేహితుడే ఈ పత్రంపై సంతకం చేశారు. అంతర్యుద్ధం నుంచి అమెరికాను రక్షించే క్రమంలో అధ్యక్షుడు అబ్రహాం లింకన్ హత్యకు గురైన విషయం తెలిసిందే. 

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...