Abn logo
Aug 2 2021 @ 00:41AM

జడ్పీ సమావేశానికి సభ్యుల గైర్హాజరు

సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ

వాయిదా వేసినట్లు ప్రకటించిన చైర్‌పర్సన్‌ 

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 1: జిల్లా ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ముహూర్తం కలిసి రావడంలేదు. వరుసగా సమావేశాలకు సభ్యులు గైర్హాజరవుతుండడంతో వాయిదాపడడం ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఆదివారం జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి జడ్పీటీసీలు, ఎంపీపీలు ఒక్కరు కూడా హాజరుకాలేదు.అరగంటసేపు వేచిచూసిన అనంతరం చైర్‌పర్సన్‌ విజయ సభ్యులు గైర్హాజరైనందున సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశానికి సీఈవో ప్రియాంకతోపాటు జిల్లా అధికారులు, జడ్పీ అధికారులు హాజరయ్యారు. అనంతరం ఇటీవలే సీఈవోగా బాధ్యతలను స్వీకరించిన ప్రియాంకను జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ శాలువాతో సత్కరించారు.