నీ నగ్న ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయంటూ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పడంతో బిత్తరపోయిన యువతి.. ఎవరి పనా అని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2021-10-29T06:05:39+05:30 IST

ఓ అమ్మాయి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడో దుర్మార్గుడు. ఆ అమ్మాయిని వేధించాలనే ఉద్దేశంతో ఈ దారుణానికి..

నీ నగ్న ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయంటూ ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పడంతో బిత్తరపోయిన యువతి.. ఎవరి పనా అని ఆరా తీస్తే..

రాయ్‌పూర్: ఓ అమ్మాయి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడో దుర్మార్గుడు. ఆ అమ్మాయిని వేధించాలనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ గటన ఛత్తీస్‌ఘర్‌లోరి దేవేంద్రనగర్ ప్రాంతంలో జరిగింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం ఓ ఫంక్షన్‌లో సురేశ్ అనే వ్యక్తిని బాధితురాలు కలిసింది. ఆ సమయంలో ఏదో విషయం ఇద్దరికీ వివాదం నెలకొంది. అప్పుడే ఆమెను ఎలాగైనా కష్టపెట్టాలని నిర్ణయించుకున్న సురేశ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పేరుతో ఓ ఫేక్ ఐడీని తయారు చేసి.. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. నగ్న ఫోటోలకు బాధితురాలి ఫేస్‌ను మార్ఫ్ చేసి.. పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం బాధితురాలి స్నేహితులు గుర్తించి.. ఆమెకు తెలియజేశారు. ఆమె తన తల్లిదండ్రులకు చెప్పగా.. అందరూ కలిసి దేవేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. ఆమె బంధువైన సురేశ్ ఈ పని చేసినట్లు తేలింది. 33 ఏళ్ల సురేశ్‌ ఓ ఆటోమొబైల్ కంపెనీలో సేల్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. అయితే నిందితుడు తొలుత నేరాన్ని ఒప్పుకోలేదు. తన మొబైల్ హ్యాక్ అయి ఉంటుందని, తాను ఏ పాపం ఎరుగనని ప్రాథేయపడ్డాడు. కానీ పోలీసులు గట్టిగా విచారించడంతో తన తప్పును ఒప్పుకున్నాడు. తానే ఆమెపై పగతో ఇలా చేశానని నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2021-10-29T06:05:39+05:30 IST