పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-01-22T05:22:58+05:30 IST

పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాల కరెస్పాండెంట్‌ ఫాదర్‌ ఆరోగ్య స్వామి తెలిపారు.

పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో విద్యార్థులు, కరెస్పాండెంట్‌ ఫాదర్‌ ఆరోగ్యస్వామి

కడప(ఎడ్యుకేషన్‌), జనవరి 21 : పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాల కరెస్పాండెంట్‌ ఫాదర్‌ ఆరోగ్య స్వామి తెలిపారు. కడప నగరం సెయిం ట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం  స్వచ్ఛభారత్‌ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే సేవాగుణం కలిగి ఉండాలన్నారు. సమాజసేవలో ఎన్‌ఎ్‌సఎ్‌స విద్యార్థులు ముందుండి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రాజెక్టు అధికారులు నాగార్జున, రాకేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:22:58+05:30 IST