కచ్చితంగా కుట్రే!

ABN , First Publish Date - 2021-01-13T06:12:42+05:30 IST

రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవీ - దేవతామూర్తుల విధ్వంసం, దేవతామూర్తులను అవమానించడం వంటి సంఘటనలు సంవత్సరం నుంచీ జరుగుతూనే ఉన్నాయి...

కచ్చితంగా కుట్రే!

రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవీ - దేవతామూర్తుల విధ్వంసం, దేవతామూర్తులను అవమానించడం వంటి సంఘటనలు సంవత్సరం నుంచీ జరుగుతూనే ఉన్నాయి. దీనిపై పాలక - ప్రతిపక్షాలు పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి తప్ప, దాడులు మాత్రం ఆగటంలేదు. హిందూధర్మానికి అవమానం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పాలకపార్టీ ప్రతిపక్షాల్ని విమర్శిస్తూ తన బాధ్యతారాహిత్యాన్ని నిర్లజ్జగా ప్రదర్శించుకుంటోంది. అకృత్యాలు చేస్తున్న శక్తుల్ని పట్టుకొని శిక్షించి, దేవాలయాలపై, హిందూధర్మంపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా ! తిరుమలలో దేవాలయ అలంకరణలో శిలువ గుర్తును ప్రదర్శించడం కచ్చితంగా కుట్రే.  ఈ  కుట్రను బయటపెట్టినందుకు తి.తి.దే. లోని బాధ్యుల్ని శిక్షించాల్సింది పోయి,  బయటపెట్టిన హిందువును అకారణంగా అరెస్ట్ చెయ్యడం, అంతర్వేది ఉద్యమంలో చర్చి అద్దం పగిలిందన్న ఆరోపణతో దాదాపు 40 మంది హిందువుల్ని రాజమండ్రి జైలుకు పంపించడం వంటివి ఈ రాష్ట్ర ప్రభుత్వ హిందూ వ్యతిరేక విదేశీ మత పక్షపాతానికి నిదర్శనాలుగా భావించాలి. హిందూయువకుల్ని అరెస్ట్ చెయ్యడంలో చూపించిన అత్యుత్సాహం, సమర్ధతను హిందూధర్మంపై, విధ్వంసం చేస్తున్న శక్తుల్ని పట్టుకొని శిక్షించటంలో ఎందుకుచూపించడంలేదు? పైగా ప్రభుత్వంలోని మంత్రులచేత అసందర్భ ప్రకటనలు చేయిస్తూండటం అనేక సందేహాలకు తావిస్తున్నది. రాష్ట్రప్రభుత్వం హిందూ దేవీ - దేవతామూర్తులు - దేవాలయాలపై దాడులు చేస్తున్న దుర్మార్గుల్ని తొందరగా పట్టుకొని కఠినంగా శిక్షించడం ద్వారా తన బాధ్యతను నిర్వర్తించాలి. 

వీరుభొట్ల పేరయ్యశాస్త్రి, 

విజయవాడ


Updated Date - 2021-01-13T06:12:42+05:30 IST