అంతర్జాతీయ ప్రయాణికులకు అబుధాబి కొత్త నిబంధనలు!

ABN , First Publish Date - 2021-08-15T15:33:45+05:30 IST

యూఏఈ రాజధాని అబుధాబి అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.

అంతర్జాతీయ ప్రయాణికులకు అబుధాబి కొత్త నిబంధనలు!

అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబి అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. అబుధాబి అత్యవసర, సంక్షోభం మరియు విపత్తుల కమిటీ తాజాగా ఈ నిబంధనలు ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి  విదేశాల నుంచి అబుధాబికి వచ్చే యూఏఈ పౌరులు, నివాసితులు, సందర్శకులు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. గ్రీన్ లిస్ట్ దేశాల నుండి అబుధాబికి వచ్చే టీకాలు వేసుకున్న ప్రయాణికులు తప్పనిసరిగా పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. అలాగే అబుధాబికి వచ్చిన తర్వాత 6వ రోజు మరోసారి పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. వీరికి క్వారంటైన్ ఉండదు. 


ఇక గ్రీన్ లిస్ట్ గమ్యస్థానాల నుండి కాకుండా వేరే దేశాల నుంచి వచ్చేవారు రాగానే పీసీఆర్ టెస్టు చేయించుకోవడంతో పాటు ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అలాగే 6వ రోజు మళ్లీ పీసీఆర్ పరీక్ష ఉంటుంది. గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే వ్యాక్సిన్ తీసుకోని పౌరులు, నివాసితులు, విజిటర్స్ అబుధాబి చేరుకున్న తర్వాత తప్పనిసరిగా పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. వీరికి క్వారంటైన్ ఉండదు. కానీ, 6వ రోజు, 9వ రోజు రెండు పీసీఆర్ టెస్టులు ఉంటాయి. అలాగే ఇతర గమ్యస్థానాల నుండి వచ్చిన వారు తప్పనిసరిగా పీసీఆర్ పరీక్ష, 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. దీంతో పాటు 9వ రోజు మరోసారి పీసీఆర్ టెస్టు ఉంటుంది. 

Updated Date - 2021-08-15T15:33:45+05:30 IST