ఆ ప్రయాణికులకు Abu Dhabi పండగలాంటి వార్త !

ABN , First Publish Date - 2021-09-03T14:14:28+05:30 IST

యూఏఈ రాజధాని అబుధాబి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికుల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఆ ప్రయాణికులకు Abu Dhabi పండగలాంటి వార్త !

అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రయాణికుల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీరికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జాతీయ అత్యవసర సంక్షోభం, విపత్తు నిర్వహణ అథారిటీ కీలక ప్రకటన చేసింది. యూఏఈకి వచ్చే వీసాదారులు ఎవరైతే రెండు డోసులు టీకా పూర్తి చేసుకున్నారో వారికి క్వారంటైన్ ఉండదని స్పష్టం చేసింది. ఈ నెల 5 నుంచి ఈ నిబంధనను అమలులోకి తీసుకురానున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. అయితే, గ్రీన్ లిస్ట్ దేశాల జాబితాలో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు మాత్రం తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని పేర్కొంది. అలాగే అబుధాబి వచ్చిన తర్వాత ప్రయాణికులందరూ తప్పనిసరిగా 4 నుంచి 8 రోజుల్లో పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని తెలిపింది. ఇక కొత్తగా విజిట్ వీసా పొందినవారు యూఏఈ వచ్చేందుకు ఐసీఐ, జీడీఆర్ఎఫ్ఏల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవల్సిన అవసరం లేదని వెల్లడించింది. 


ఇక అబుధాబి 'గ్రీన్ లిస్ట్' దేశాల జాబితాను తాజాగా సవరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జాబితాలో మొత్తం 55 దేశాలు ఉన్నాయి. భారత్‌కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కలేదు. అబుధాబి 'గ్రీన్ లిస్ట్' దేశాల జాబితాలో ఉన్న 55 దేశాలివే.. 1. అలాబానియా, 2. అమెరికా, 3. ఆస్ట్రేలియా, 4. ఆస్ట్రియా, 5. బహ్రెయిన్, 6. బెల్జీయం, 7. భూటాన్, 8. బ్రూనై, 9. బల్గేరియా, 10. కెనడా, 11. చైనా, 12. కొమొరాస్, 13. క్రొయేషియా, 14. సైప్రస్, 15. చెక్ రిపబ్లిక్, 16. డెన్మార్క్, 17. ఫిన్లాండ్, 18. జర్మనీ, 19. గ్రీస్, 20. హాంగ్‌కాంగ్, 21. హంగేరీ, 22. ఐర్లాండ్, 23. ఇటలీ, 24. జపాన్, 25. జోర్డాన్, 26. కువైత్, 27. కీర్గిజ్‌స్తాన్, 28. లక్సెంబర్గ్, 29. మాల్దీవులు, 30. మాల్టా, 31. మారిషస్, 32. మోల్డోవా, 33. మొనాకో, 34. నెదర్లాండ్స్, 35. న్యూజిలాండ్, 36. నార్వే, 37. ఒమన్, 38. పోలాండ్, 39. పోర్చుగల్, 40. ఖతర్, 41. రొమానియా, 42. శాన్ మారినో, 43. సౌదీ అరేబియా, 44. సెర్బియా, 45. సీషెల్స్, 46. సింగపూర్, 47. స్లోవేకియా, 48. స్లోవేనియా, 49. సౌత్ కోరియా, 50. స్వీడన్, 51. స్వీట్జర్లాండ్, 52. తైవాన్, 53. తజకిస్తాన్, 54. తుర్క్మెనిస్తాన్, 55. ఉక్రెయిన్.


Updated Date - 2021-09-03T14:14:28+05:30 IST