జియోలోకి పెట్టుబడుల వెల్లువ.. రూ.7,576 కోట్లు పెట్టేందుకు సిద్ధమైన మరో కంపెనీ

ABN , First Publish Date - 2020-05-29T02:43:42+05:30 IST

రిలయన్స్ జియోలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్, సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్,

జియోలోకి పెట్టుబడుల వెల్లువ.. రూ.7,576 కోట్లు పెట్టేందుకు సిద్ధమైన మరో కంపెనీ

ముంబై: రిలయన్స్ జియోలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఫేస్‌బుక్, సిల్వర్‌లేక్ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, విస్టా ఈక్విటీ వంటి కంపెలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. తాజాగా, అబుధాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో బిలియన్ డాలర్లు.. భారత కరెన్సీలో దాదాపు రూ.7,576 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. పెట్టుబడుల ద్వారా జియో ఒక నెలలోనే ఏకంగా 10 బిలియన్ డాలర్లు (రూ. 75,762 కోట్లు) సమీకరించింది. జియోలో అమెరికాకు చెందిన కేకేఆర్ గత వారమే రూ. 11,367 కోట్లు పెట్టుబడి పెట్టింది. ప్రస్తుతం జియో-ముబదాలా కంపెనీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. చర్చలు సఫలమై జియోలో ముబదాలా వాటాలు కొనుగోలు చేస్తే ఆరో కంపెనీ కానుంది.

Updated Date - 2020-05-29T02:43:42+05:30 IST