గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించిన Abu Dhabi.. కానీ భారత్‌కు మాత్రం..

ABN , First Publish Date - 2021-10-08T17:27:13+05:30 IST

యూఏఈ రాజధాని అబుధాబి మరోసారి గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించింది.

గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించిన Abu Dhabi.. కానీ భారత్‌కు మాత్రం..

అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబి మరోసారి గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితాను సవరించింది. మరికొన్ని దేశాలకు ఈ జాబితాలోకి చేర్చింది. కానీ ఈసారి కూడా భారత్‌కు ఈ ఆ జాబితాలో చోటు దక్కలేదు. ఇక ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రీన్‌లిస్ట్ దేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ నిబంధనను తొలగించింది. అయితే, ప్రయాణికులందరూ జర్నీకి 48 గంటల ముందు చేయించుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించడం తప్పనిసరి. అలాగే అబుధాబి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత మరోసారి టెస్టు చేయించుకోవాలి. 


ఇక గ్రీన్‌లిస్ట్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైతే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారో వారు అబుధాబి వచ్చిన తర్వాత ఆరో రోజున కూడా మళ్లీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇవే దేశాల నుంచి వచ్చే టీకా తీసుకోని ప్రయాణికులు మాత్రం ఆరో రోజుతో పాటు తొమ్మిదో రోజున కూడా మరోసారి కరోనా టెస్టు చేయించుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. తాజాగా అప్‌డేట్ చేసిన గ్రీన్‌లిస్ట్ దేశాల జాబితా శుక్రవారం(అక్టోబర్ 08) తెల్లవారుజాము నుంచే అమలులోకి వస్తుందని ప్రకటించారు.        


అబుధాబి సవరించిన గ్రీన్‌లిస్ట్ దేశాల తాజా జాబితా ఇదే..

Albania

Armenia

Australia

Austria

Azerbaijan

Bahrain

Belarus

Belgium

Belize

Bhutan

Bolivia

Bosnia and Herzegovina

Brazil

Brunei

Bulgaria

Burma

Burundi

Canada

Chile

China

Colombia

Comoros

Croatia

Cyprus

Czech Republic

Denmark

Ecuador

Estonia

Finland

France

Georgia

Germany

Greece

Holland

Hong Kong (SAR)

Hungary

Iceland

Indonesia

Israel

Italy

Japan

Jordan

Kazakhstan

Kuwait

Kyrgyzstan

Liechtenstein

Luxembourg

Maldives

Malta

Mauritius

Moldova

Monaco

Montenegro

Morocco

New Zealand

Norway

Oman

Poland

Portugal

Qatar

Republic of Ireland

Russia

San Marino

Saudi Arabia

Serbia

Seychelles

Singapore

Slovakia

Slovenia

South Korea

Spain

Sweden

Switzerland

Taiwan, Province of China

Tajikistan

Thailand

Tunisia

Turkmenistan

Ukraine

United Kingdom

United States of America

Uzbekistan

ఈ గ్రీన్‌లిస్ట్‌కు సంబంధించి ఇతర సమాచారం కోసం www.visitabudhabi.comలో చూడొచ్చు. 

Updated Date - 2021-10-08T17:27:13+05:30 IST