అబుదాబీ కంపెనీతో రిలయన్స్‌ జట్టు

ABN , First Publish Date - 2021-12-08T08:05:59+05:30 IST

అబుదాబీ కెమికల్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్‌ (తాజీజ్‌) భాగస్వామ్యంలో 200 కోట్ల డాలర్ల (రూ.15,000 కోట్లు) పెట్టుబడితో...

అబుదాబీ కంపెనీతో రిలయన్స్‌ జట్టు

  రూ.15,000 కోట్ల పెట్టుబడితో 

   పెట్రోకెమికల్‌ ప్లాంట్‌ నిర్మాణం 


న్యూఢిల్లీ: అబుదాబీ కెమికల్‌ డెరివేటివ్స్‌ కంపెనీ ఆర్‌ఎస్‌సీ లిమిటెడ్‌ (తాజీజ్‌) భాగస్వామ్యంలో 200 కోట్ల డాలర్ల (రూ.15,000 కోట్లు) పెట్టుబడితో అబుదాబీలో పెట్రోకెమికల్‌ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ఇంధన దిగ్గజం అబుదాబీ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (అడ్నాక్‌), ఆ దేశ హోల్డింగ్‌ కంపెనీ ఏడీక్యూ ఉమ్మడి భాగస్వామ్యంలో ఈ తాజీజ్‌ ఏర్పాటైంది. అరబిక్‌ బాషలో తాజీజ్‌ అనగా పురోగతి, బలోపేతం లేదా సంస్థ ఏర్పాటు అని అర్థం. తాజీజ్‌లో భాగంగా పశ్చిమ అబుదాబీలోని రువాయి్‌సలో భారీ పెట్రో కెమికల్‌, ఇండస్ట్రియల్‌ హబ్‌ నిర్మాణం జరుగుతోంది. ఇదే హబ్‌లో ‘తాజీజ్‌ ఈడీసీ అండ్‌ పీవీసీ’ పేరుతో ప్రపంచ స్థాయి పెట్రో రసాయనాల ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు తాజీజ్‌తో రిలయన్స్‌ జట్టు కట్టింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా క్లోర్‌ అల్కలీ, ఎథిలిన్‌ డైక్లోరైడ్‌ (ఈడీసీ), పాలీవినైల్‌ క్లోరైడ్‌ (పీవీసీ) తయారీ కోసం ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్‌ను నిర్మించనున్నారు. 

Updated Date - 2021-12-08T08:05:59+05:30 IST