Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యార్థులను చైతన్య పరచాలి

సమావేశాల్లో మాట్లాడుతున్న ఆంధ్రా, తెలంగాణ, కర్నాటక రాషా్ట్రల సంఘటనా కార్యదర్శి ఎస్‌.బాలకృష్ణ, తదితరులు

ఏబీవీపీ సంఘటన కార్యదర్శి ఎస్‌.బాలకృష్ణ

నరసరావుపేట టౌన, నవంబరు27: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై ఉద్యమించడంతోపాటు డ్రగ్‌, మాదకద్రవ్యాల ఉచ్చులో విద్యార్థులు పడకుండా  చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఏబీవీపీ ఆంధ్రా, తెలంగణ, కర్నాటక రాషా్ట్రల సంఘటన కార్యదర్శి ఎస్‌.బాలకృష్ణ అన్నారు. శనివారం స్థానిక గీతామందిరంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బాలకృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాట వీరులను గుర్తించి, వారి కుటుంబాలను కలిసి మరింత సమాచారాన్ని సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర కార్యదర్శి చల్లా కౌశిక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులు సమస్యల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎం.నాగఫణిశాసి్త్ర మాట్లాడుతూ విద్యారంగం, రాష్ట్ర స్థితి, రాష్ట్ర శాసనసభలో జరుగుతున్న తీరు గురించి చర్చించి తీర్మానాలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి చిరిగే శివకుమార్‌, దక్షిణ క్షేత్ర సహ సంఘటన కార్యదర్శి స్వామి, ప్రాంత ప్రముఖ పెంచలయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.సాంబశివారావు, సంయుక్త కార్యదర్శులు ప్రసాద్‌, సుప్రియ, కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

Advertisement
Advertisement