Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి

ఏబీవీపీ నేతల ఆందోళన

నెల్లూరు(విద్య), డిసెంబరు 4 : ప్రఽభుత్వం వెంటనే జీవో 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏబీవీపీ నేతలు శనివారం నగరంలోని వీఆర్‌సీ సెంటర్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. పోలీసులు ర్యాలీని అడ్డుకుని ఏబీవీపీ నేతలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్‌కుమార్‌, జిల్లా కన్వీనర్‌ రాజశేఖర్‌, నగర కార్యదర్శి సాయికృష్ణ, నాయకులు మనోహర్‌, లక్షణ్‌, యశ్వంత్‌, బాలాజీ, ఉదయ్‌, జయంత్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement