ఏసీ బస్సులకు బ్రేక్‌.. దూర ప్రాంతాలకు నిలుపుదల

ABN , First Publish Date - 2020-08-04T17:08:53+05:30 IST

కరోనా ప్రబలుతున్న కారణంగా రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌ అధికారులు ఏసీ బస్సులను రద్దు చేశారు. అంతర్రాష్ట్ర రూటు బెంగళూరుతో సహా విశాఖపట్నం, భీమవరం, రాజమండ్రి, తిరుపతిలకు

ఏసీ బస్సులకు బ్రేక్‌.. దూర ప్రాంతాలకు నిలుపుదల

బెంగళూరు, విశాఖ, రాజమండ్రి, భీమవరం, తిరుపతిలకు రద్దు

కరోనా కారణంగా ఆర్టీసీ నిర్ణయం


ఆంధ్రజ్యోతి, విజయవాడ: కరోనా ప్రబలుతున్న కారణంగా రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కృష్ణా రీజియన్‌ అధికారులు ఏసీ బస్సులను రద్దు చేశారు. అంతర్రాష్ట్ర రూటు బెంగళూరుతో సహా విశాఖపట్నం, భీమవరం, రాజమండ్రి, తిరుపతిలకు నడుపుతున్న ఏసీ సర్వీసులన్నింటినీ రద్దు చేశారు. రెండు రోజులుగా ఏసీ బస్సులకు రిజర్వేషన్‌ సదుపాయాన్ని కూడా ఆపేశారు.  కరోనా కేసుల తీవ్రత కారణంగానే వీటిని రద్దు చేసినట్టు ఆర్టీసీ అధికారులు చెబు తున్నారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సుల ప్రయా ణాలు చేసిన వారు కరోనా లక్షణాలతో బాధ పడు తుండటం, బస్సులను నడుపుతున్న ఆర్టీసీ సిబ్బంది సైతం కరోనా బారినపడటం వంటి కారణాలు కల కలాన్ని రేపుతున్నాయి. కొద్ది రోజుల కిందట బస్సు తోలుతున్న డ్రైవర్‌ విధి నిర్వహణలో ఉండగా.. ఆయనకు కరోనా వచ్చిందన్న సమాచారం రావటం కలకలాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే సంద ర్భంలో బెంగళూరుకు వెళ్లే బస్సుల పాయింట్‌లో విధులు నిర్వహించే ఏడీసీ, డిప్యూటీ ట్రాఫిక్‌ సూపర్‌ వైజర్‌లకు కూడా కరోనా సోకడం ఆందోళన కలిగిం చింది. ఏసీ బస్సులలో ప్రయాణం చేస్తున్నవారికి ఎక్కువగా కరోనా సోకుతుందని ఆర్టీసీ అధికారులకు సమాచారం ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఏసీ బస్సులను ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. 


Updated Date - 2020-08-04T17:08:53+05:30 IST