Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

బెల్లంపల్లి, డిసెంబరు 7: ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మంగళవారం కాంటా చౌరస్తా నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు పీడీఎస్‌టీయూ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు రెడ్డిచరణ్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాం డ్‌ చేశారు. జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బెల్లంపల్లి పట్టణంలో ట్రైబల్‌ గురుకుల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు సికిందర్‌, ప్రశాంత్‌, కృష్ణ, సాయి పాల్గొన్నారు. 

 

Advertisement
Advertisement