మాకవరపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ విచారణ

ABN , First Publish Date - 2022-01-29T06:04:22+05:30 IST

ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం విచారణ నిర్వహించారు. మండలంలోని వజ్రగడ వీఆర్‌వో చిట్టినాయుడుపై అదే గ్రామానికి చెందిన వంటాకుల అమ్మాజీ, రామశంకరరావు దంపతులు తమ భూమి ఆన్‌లైన్‌ కోసం దరఖాస్తులు చేస్తే.. డబ్బులు అడిగినట్టు ఫిర్యాదు చేశారని ఏసీబీ సీఐ కె.కిశోర్‌కుమార్‌ తెలిపారు.

మాకవరపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ విచారణ
తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న ఏసీబీ అధికారులు

  డబ్బులిస్తేనే భూములు ఆన్‌లైన్‌

 గతంలో ఫిర్యాదు చేసిన వజ్రగడకు చెందిన దంపతులు 

 తహసీల్దార్‌ను విచారించిన సీఐ కిశోర్‌కుమార్‌ బృందం

  వీఆర్‌వో నుంచి స్టేట్‌మెంట్‌ నమోదు

మాకవరపాలెం, జనవరి 28 : ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం విచారణ నిర్వహించారు. మండలంలోని వజ్రగడ వీఆర్‌వో చిట్టినాయుడుపై అదే గ్రామానికి చెందిన వంటాకుల అమ్మాజీ, రామశంకరరావు దంపతులు తమ భూమి ఆన్‌లైన్‌ కోసం దరఖాస్తులు చేస్తే.. డబ్బులు అడిగినట్టు ఫిర్యాదు చేశారని ఏసీబీ సీఐ కె.కిశోర్‌కుమార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ జరిపినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలివి. అమ్మాజీ, రామశంకరరావు దంపతులకు చెరో ఎకరా పది సెంట్ల చొప్పున మొత్తం 2.20 ఎకరాల భూమి ఉందన్నారు. ఇవి వారసత్వ భూములు కావడంతో 2020 సం వత్సరంలో తమ భూములను ఆన్‌లైన్‌ చేయాలని మాకవరపాలెం మీ-సేవా కేంద్రం ద్వారా తహసీల్దార్‌ కార్యాలయానికి దరఖాస్తులు చేశారన్నారు. అయితే వీరి దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టు పేర్కొన్నా రన్నారు. మళ్లీ 2021లో  మీ- సేవా కేంద్రం ద్వారా దరఖాస్తులు చేయగా, కొంత నగదు ఇవ్వడంతో వాటిని ఆన్‌లైన్‌ చేశారని ఆ ఫిర్యాదులో వివరించారు. తహసీల్దార్‌ కార్యా లయంలో డబ్బులు ఇస్తే తప్ప ఆన్‌లైన్‌ చేయడం లేదని వారి నుంచి అప్పట్లో అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్టు చెప్పారు. దీనిపై తహసీల్దార్‌ రాణి అమ్మాజీని విచారణ చేయగా, గతంలో సదరు దంపతులు దరఖాస్తులు చేశారని, సరైన ఆధారాలు లేకపోవడంతో తిరస్కరించినట్టు చెప్పారన్నారు. రెండోసారి ఆధారాలు సమర్పించడంతో  దంపతుల పేరున ఉన్న భూములను ఆన్‌లైన్‌ చేశామని వివరించారని తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించి మీ-సేవా కేంద్రం నుంచి వచ్చిన వీరి రెండు విడతల దరఖాస్తులను స్వాధీనం చేసకున్నామన్నారు. అంతేకాకుండా వీఆర్‌వో నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసినట్టు చెప్పారు. ఆయన వెంట పలువురు ఏసీబీ సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2022-01-29T06:04:22+05:30 IST