Abn logo
Oct 23 2021 @ 07:34AM

మళ్లీ Acb పంజా.. మాజీ మంత్రికి చెందిన 4 ప్రాంతాల్లో సోదాలు

అడయార్‌(Chennai): గత ప్రభుత్వంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేసిన విజయభాస్కర్‌కు చెందిన నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు మరోమారు శుక్రవారం సోదాలు చేశారు. మాజీ ఆరోగ్య మంత్రి విజయభాస్కర్‌ సహా ఆయన అనుచరులు, బంధువులు, స్నేహితుల ఇళ్ళలో ఏసీబీ అధికారులు గతంలో సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో రూ.23.85 లక్షల నగదు, 4.87 కిలోల బంగారం ఆభరణాలు, 136 భారీ వాహనాల రిజిస్ట్రేషన్‌ పత్రాలు, 19 కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి విచారణకు మాజీ మంత్రి సహకరించకపోవడంతో తాజాగా మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు చేశారు. చెన్నై నందనంలోని శరవణన్‌ అనే వ్యక్తి నివాసం, థౌజండ్‌లైట్‌లో ఉన్న శాంసన్‌ డెవలపర్స్‌, అన్నానగర్‌లోని విజయభాస్కర్‌ సహాయకుడు మురుగన్‌ నివాసం, సేలం ధరణ్‌ ఆస్పత్రి వైద్యుడు సెల్వరాజి నివాసాల్లో ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సిఉంది. 

ఇవి కూడా చదవండిImage Caption