Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

ప్రకాశం: ఓ రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వీఆర్వో పట్టుబడ్డాడు. రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి జిల్లాలోని కురిచేడు గ్రామ వీఆర్వో వెంకట నాగరాజు చిక్కాడు. ఓ  రైతుకు చెందిన పొలాన్ని పాస్‌బుక్‌లో ఎక్కించడానికి ఆ రైతును వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఆ రైతు తెలియజేశాడు. ఆ రైతు దగ్గర లంచం డబ్బులను వీఆర్వో వెంకట నాగరాజు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన జిల్లాలోని రెవెన్యూ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా  ఏసీబీ అధికారులు మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులకు తెలియపరచాలన్నారు. 

Advertisement
Advertisement