Abn logo
Apr 17 2021 @ 00:40AM

కలకలం

 పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీ గురి

 సచివాలయంతో పాటు  ఆయన స్వగ్రామంలో తనిఖీలు

రణస్థలం, ఏప్రిల్‌ 16: జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఓ చిరుద్యోగి భారీగా ఆస్తులు కూడ బె ట్టారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన పనిచేస్తున్న కార్యాలయంతో పాటు స్వ గ్రామం, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధి కారులు ఏకకాలంలో దాడులు చేశారు.   జిల్లాతో పాటు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కూడా సోదాలు చేయడంతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి అగురు వెంకటరావు అక్రమాస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ అధికా రులు ప్రత్యేక దృష్టి సారించారు. డీఎస్పీ రమణమూర్తి ఆధ్వ ర్యంలో శుక్రవారం ఏకకాలంలో దాడులు చేశారు.  పైడి భీమవరం సచివాలయంతో పాటు ఆయన స్వగ్రామమైన వంగర మండలం అరసాడలో కుటుంబసభ్యుల ఇళ్లలో సై తం తనిఖీలు చేశారు. అదే సమయంలో విశాఖలోని పౌర గ్రంథాలయానికి సమీపంలో ఆయన నివాసముంటున్న ఇం టిలో సోదాలు చేశారు. ప్రస్తుతం పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శిగా ఉన్న అగురు వెంకటరావు గత పదేళ్లుగా రణస్థలం మండలం బంటుపల్లి, సంచాంలో కూడా విధులు నిర్వహించారు. విజయనగరంలో నివాసం ఉంటూ రాకపోకలు చేసేవారు. ఇటీవల పిల్లల చదువుల నిమిత్తం విశాఖపట్నం వెళ్లా రు. కుమారుడు బీటెక్‌ పూర్తి చేశాడు. కుమార్తె ఇంజనీరింగ్‌ చదువుతోం ది. అయితే, ఆయన అక్రమార్జనతో పాటు అక్రమ స్థిర, చరాస్తులు సంపాదించాడని శ్రీకాకుళం అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఇటీవల ఫిర్యాదు అందింది. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఏసీబీ సీఐ ఎస్‌కే గపూర్‌ తన సిబ్బందితో పైడిభీమవరం సచివాలయానికి చేరుకున్నా రు. దీంతో సచివాలయ సిబ్బంది హడలిపోయారు. తన వద్దనున్న వారెంట్‌ను సీఐ చూపించి తనిఖీలు చేశారు. సు మారు 2 గంటల పాటు సోదాలు చేశారు. వెంకటరావుకు సంబంధించిన ఎటువంటి వివరాలు సచివాలయంలో లభ్యంకాలేదని సీఐ ఎస్‌కే గపూర్‌ విలేకరులకు తెలిపారు. కాగా, వెంకటరావు సమీప బంధువు ఒకరు కేంద్రమంత్రి వద్ద ఓఎస్‌డీగా చేస్తున్నారని, ఆయనకు బినామీగా వెంకట రావు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం సాయంత్రం వెంకటరావుతో పాటు ఆయన బంధువుల పేరిట భారీగా అక్రమాస్తులు కూడగట్టారని ఏసీబీ ఉన్నతాధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. 


అరసాడలోనూ సోదాలు 

వంగర : వంగర మండలం అరసాడలోనూ ఏసీబీ అధి కారులు సోదాలు చేశారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రామ మూర్తి ఆదేశాల మేరకు అరసాడకు చెందిన ఆగూరు సత్యం నాయుడు(వెంకటరావు సోదరుడు) ఇంట్లో శుక్రవారం తనిఖీ లు చేశారు. సత్యంనాయుడుతో పాటు ఆయన కుటుంబ స భ్యులను ఏసీబీ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సూర్యనారాయణలు విచారణ చేపట్టారు. ఆస్తుల వివరాలు సేకరించారు.  భూ ములకు సంబంధించిన విలువైన పత్రాలను స్వాధీనం చేసు కున్నట్టు తెలిసింది. దీనిపై విశాఖలోని తమ కార్యాలయానికి నివేదిక అందజేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement