గ్యాస్‌ దహనవాటిక పనులు వేగవంతం చేయండి : మేయర్‌ వసీం

ABN , First Publish Date - 2021-05-17T05:40:24+05:30 IST

గ్యాస్‌ దహనవాటికను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేలా ప నులు వేగవంతం చే యాలని నగర మేయ ర్‌ మహమ్మద్‌ వసీం.. అధికారులను ఆదేశించారు.

గ్యాస్‌ దహనవాటిక పనులు వేగవంతం చేయండి : మేయర్‌ వసీం
ఏడో డివిజన్‌లో పర్యటిస్తున్న మేయర్‌ వసీం, మాజీ మేయర్‌ రాగే పరశురాం

అనంతపురం కార్పొరేషన్‌, మే16: గ్యాస్‌ దహనవాటికను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేలా ప నులు వేగవంతం చే యాలని నగర మేయ ర్‌ మహమ్మద్‌ వసీం.. అధికారులను ఆదేశించారు. నగరంలోని హ రిశ్చంద్రఘాట్‌లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తు న్న గ్యాస్‌ దహనవాటిక పనులను ఆదివారం మేయర్‌.. అధికారులతో కలిసి పరిశీలించారు. గ్యాస్‌ కనెక్షన్‌తోపాటు ఇతరత్రా కొన్ని పనులు చేపట్టాల్సి ఉందని అధికారులు.. మేయర్‌కు వివరించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గ్యాస్‌ దహనవాటిక అందుబాటులోకి తీసుకువస్తే ఉపయోగంగా ఉంటుందని మేయర్‌ సూచించారు.

 


Updated Date - 2021-05-17T05:40:24+05:30 IST