Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెంచాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌, నవంబరు 30: జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్ట్‌ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం ప్రాజెక్ట్‌ల పురోగతిపై సంబంధిత అధికారులతో  సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాజెక్ట్‌ పనులను సమన్వయంతో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్యాకేజీ 9 మల్కపేట రిజర్వాయర్‌కు భూ సేకరణకు అవార్డుల ప్రతిపాదనలు అందజేయాలన్నారు. అటవీ హద్దులను పరిష్కరించాలని, జాయింట్‌ సర్వేను చేయాలని ఆదేశించారు. ప్రాజెక్ట్‌ 12 మల్లన్న సాగర్‌ కెనాల్‌ పీడీ ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ అవార్డు తయారీ తుది దశలో ఉందన్నారు. టీఎస్‌ఐఐసీ, పెద్దూర్‌, బోనాల ఇండస్ట్రీయల్‌ పార్కు పనుల్లో వేగం పెంచాలన్నారు. రెండో బైపాస్‌ రోడ్డు పనులకు అవార్డు అమోదానికి సిద్ధం చేశామన్నారు. సీఏ భూముల అప్పగింతల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపడుతున్న రోడ్లు, వంతెనల పూర్తికి సమన్వయంతో అధిగమించాలన్నారు.  సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ స్యతప్రసాద్‌, జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, జిల్లా  ఇన్‌చార్జి రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, వేమలువాడ ఆర్డీవో లీల, ప్యాకేజీ 9 ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, సర్వేయర్‌ ఏడీ శ్రీనివాస్‌, మిషన్‌భగీరథ ఇంట్రా ఈఈ జానకి, కలెక్టరేట్‌ పర్యవేక్షకులు రవికాంత్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement