రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-04-17T06:06:07+05:30 IST
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
నందిగామ రూరల్, ఏప్రిల్ 16: మండలంలోని అడవిరావులపాడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన సమాచారం మేరకు.. ఖమ్మం జిల్లా మెట్టగూడెం గ్రామానికి చెందిన గుంటుపల్లి శరత్ బైకుపై నందిగామ వస్తుండగా గ్రామ సమీపంలోని నల్లవాగు వద్ద బైకు అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శరత్ను నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.