బంజారాహిల్స్, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఢీకొట్టాడు సూడాన్ దేశస్థుడు. కార్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన డీఐ మహ్మద్ హఫీజుద్దీన్, ఏఎ్‌సఐ వసంత్‌నాయక్, కానిస్టేబుల్ రవితేజ బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోగల ఒహరీస్ ఐ ల్యాండ్ వద్ద ఈ నెల 19వ తేదీరాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. పెన్షన్ కార్యాలయం నుంచి ద్విచక్ర వాహనంపై వేగంగా వస్తున్న ఓ యువకుడు రవితేజను ఢీకొట్టి వెళ్లిపోయాడు. గాయపడిన రవితేజను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. ప్రమాదానికి కారణమైన వాహనం నెంబరు ఆధారంగా దర్యాప్తు చేసి వాహనం నడిపింది సూడాన్ దేశానికి చెందిన హజ్యఫాయూనిస్ అహ్మద్ ఇబ్రహీంగా గుర్తించారు. సికింద్రాబాద్ బీజే కాలేజీలో బీసీఏ చదువుకున్న ఇబ్రహీం సయ్యద్‌నగర్‌లో నివసిస్తున్నాడు. కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.