Abn logo
Sep 26 2021 @ 23:49PM

పాదచారులను ఢీకొట్టిన బైక్‌

మృతిచెందిన అమర్‌భోయ్‌

ఒకరి మృతి.. మరొకరికి తీవ్రగాయాలు

నాదెండ్ల, సెప్టెంబరు 26: గణపవరం గ్రామ పరిధిలో గుర్తుతెలియని మోటారు బైక్‌ పాదచారులను ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాషా్ట్రనికి చెందిన ఐదుగురు వ్యక్తులు గణపవరం పరిధిలోని భవనం టెక్స్‌టైల్స్‌లో పనిచేసేందుకు శనివారం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే వారిలో ఒకరికి ఆరోగ్యం సరిగాలేకపోవడంతో మందుల కోసం గణపవరంలోని ఓ మెడికల్‌ షాపునకు వెళ్ళారు. మందులు కొనుగోలు చేసి సర్వీసు రోడ్డులో నడుచుకుంటూ మిల్లుకు వస్తుండగా పరంధామయ్య జిన్నింగ్‌ మిల్లు సమీపంలో వారిని గుర్తుతెలియని మోటారుబైక్‌ ఢీకొట్టి వెళ్ళింది. ఈ ఘటనలో అమర్‌భోయ్‌ (27), దీపక్‌ ప్రధాన్‌లు గాయపడగా 108 వాహనంలో చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అమర్‌భోయ్‌ శనివారం రాత్రి మృతిచెందగా దీపక్‌ ప్రధాన్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు.