నిశ్చితార్థం ఏర్పాట్లలో విషాదం

ABN , First Publish Date - 2021-11-24T04:25:06+05:30 IST

నిశ్చితార్థం ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, కాబోయే పెండ్లికుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.

నిశ్చితార్థం ఏర్పాట్లలో విషాదం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నర్సింహారావు

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కారు

ఒకరి మృతి, కాబోయే పెళ్లికొడుకు పరిస్థితి విషమం

తల్లాడ, నవంబరు 23: నిశ్చితార్థం ఏర్పాట్లలో నిమగ్నమై ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా, కాబోయే పెండ్లికుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘ టన మంగళవారం తల్లాడ మండలం అంజనాపురం వద్ద తల్లాడ-దేవరపల్లి జాతీయ రహ దారి లో జరిగింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న అంజ నా పురానికి చెందిన తెల్లబోయిన నాగేశ్వరరావు(35)దుర్మరణం చెందగా, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నల్లగొర్ల నర్సింహారావు పరిస్థితి విషమంగా ఉంది. నర్సింహారావుకు పెనుబల్లి మండలం గోపాల పురానికి చెందిన యువతితో పెండ్లి నిశ్చయమైంది. నర్సింహారావు పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమం బుధవారం గోపాలపురంలో జరుగనుంది. నిశ్చితార్థ కార్యక్రమానికి అంజనాపురం నుంచి బంధు మిత్రులను తరలించేందుకు అవసరమైన వాహనాన్ని మాట్లాడేందుకు నాగేశ్వరరావు, నర్సింహా రావు కలిసి బైక్‌పై వెళ్లి కల్లూరు నుంచి అంజనాపురం తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గా యపడి అపస్మారక స్థితిలో ఉన్న నాగేశ్వరరావు, నర్సింహారావులను 108వాహనంలో చికిత్సకు ఖ మ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో నాగేశ్వరరావు మృతిచెందాడు. నర్సింహారావును ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. నర్సింహారావు ఆరోగ్య పరిస్థితి కూడా విష మంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. మృతిచెందిన నాగేశ్వరరావుకు భార్య, 7,4 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు. నాగేశ్వరరావు గతంలో ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేసి మధ్యలో మానేశాడు. ప్రస్తుతం వ్యవసాయ కూలీపనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషి స్తున్నాడు. నర్సింహారావు రెండేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగబాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. నిశ్చితార్థానికి ముందురోజే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉండటం కుటుంబసభ్యులను కలచివేసింది. సంఘటనాస్థలానికి తల్లాడ పోలీసులు చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు.


Updated Date - 2021-11-24T04:25:06+05:30 IST