Advertisement
Advertisement
Abn logo
Advertisement

నల్లజర్ల మాజీ ఎంపీపీ కొండేపాటి మృతి

అనంతపల్లిలో విషాదఛాయలు 

కన్యాకుమారిలో ఘటన 


నల్లజర్ల, డిసెంబరు 1 : ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే కంఠమణి శ్రీనివాసరావు పెద్ద కుమారుడు, నల్లజర్ల మండల మాజీ ఎంపీపీ కొండేపాటి బాల మురళీకృష్ణ ప్రసాద్‌ (62) బుధవారం కన్యాకుమారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కృష్ణ ప్రసాద్‌ను అనంతపల్లికి చెందిన కొండేపాటి సుబ్బన్న దత్తత తీసుకున్నారు. నల్లజర్ల మండలంలో మంచి నాయకుడిగా ప్రజల మనసుల్లో నిలిచారు. రాజకీయాల అనంతరం అనంతపల్లి నుంచి ఏలూరులో స్థిరపడి కన్యాకుమారిలో రోడ్లు నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో అక్కడే నివాసం ఉంటున్నారు. బుధవారం నిర్మాణ పనులను బైక్‌పై కూర్చుని పరిశీలిస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొని మృతి చెందినట్లు  సోదరుడు కంఠమణి నారాయణ ప్రసాద్‌ తెలిపారు. బాల మురళీకృష్ణప్రసాద్‌ గతంలో భీమడోలు షుగర్‌ ఫ్యాక్టరీ చైర్మన్‌గా, సెన్సార్‌ బోర్డు సభ్యుడిగా సేవలందించారు. ఆయన మృతితో అనంతపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల మాజీ ఎంపీపీ జమ్ముల సతీష్‌, మానవత ఉపాధ్యక్షుడు మద్దిపాటి ప్రసాద్‌, బంకా అప్పారావు, బోయపాటి రమేష్‌,సుబ్బారావు, బళ్ళ నాని, గన్నమని కృష్ణమోహన్‌, వి.సతీష్‌ సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement