విద్యార్థులతో ర్యాలీ చేస్తున్న పోలీసులు, ఆర్టీఏ అధికారులు
అనకాపల్లి ఆర్టీవో రవీంద్రనాథ్
అనకాపల్లి రూరల్, జనవరి 20: రహదారి భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అనకాపల్లి ఆర్టీవో రవీంద్రనాథ్ చెప్పారు. మండలంలోని కొప్పాక, కోడూరు గ్రామాల్లో బుధవారం రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భగా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ వాహన చోదకులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆర్టీవో మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలపై అందరికీ అవగాహన అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు బాలాజీరావు, రమేశ్, సుధీర్, గోపికృష్ణ, సృజన, వాహన చోదకులు, విద్యార్థులు పాల్గొన్నారు.