Abn logo
Feb 27 2021 @ 08:07AM

చెట్టును ఢీకొన్న కారు..ఇద్దరు దుర్మరణం

చెన్నై/అడయార్ (ఆంధ్రజ్యోతి): చెంగల్పట్టు జిల్లా మదురాంతకం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. శుక్రవారం వేకువజామున జరి గిన ఈ ప్రమాదం వివరాలిలా... కోయంబత్తూరు నుంచి నలుగురు వ్యక్తులు చెన్నైకు కారులో బయలుదేరారు. శుక్రవారం వేకువజామున చెంగల్పట్టు జిల్లా మదు రాంతకం సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కను ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారిలో బాబు (58), షణ్ముగ సుందరం (60) దుర్మరణం పాలయ్యారు. గాయపడినివారిని సమీపంలోని అస్పత్రికి తరలిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement