రక్షణ చర్యలను విస్మరించడం వల్లనే ప్రమాదాలు

ABN , First Publish Date - 2021-11-28T05:53:40+05:30 IST

సింగరేణి యాజమాన్యం రక్షణ సూత్రాలు పా టించడంలో విఫలమైందని, బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై లేదని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధానకార్యదర్శి మంద నర్సింహారావు ఆరోపించారు.

రక్షణ చర్యలను విస్మరించడం వల్లనే ప్రమాదాలు
గేట్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న మంద నర్సింహారావు

- ప్రమాదాలపై యాజమాన్యాన్ని నిలదీస్తాం

- సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి

గోదావరిఖని, నవంబరు 27: సింగరేణి యాజమాన్యం రక్షణ సూత్రాలు పా టించడంలో విఫలమైందని, బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై లేదని సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, ప్రధానకార్యదర్శి మంద నర్సింహారావు ఆరోపించారు. శనివారం ఆర్‌జీ-1 పరిధిలోని జీడీకే 2ఇంక్లైన్‌లో జరి గిన గేట్‌మీటింగ్‌లో వారు మాట్లాడుతూ యాజమాన్యం ఉత్పత్తిపై చూపిస్తున్న శ్రద్ధ రక్షణ చర్యలపై చూపకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలపై అధికారులు ఎందుకు అధ్యయ నం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రమాదాలు జరిగిన ప్రతిసారి యాజమాన్యం కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటుందని, అధికారులను తప్పించడానికి కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని ఆరోపించారు. పని స్థలాల్లో పర్మినెంట్‌గా కార్మికులను నియమించకపోవడం, యాక్టింగ్‌ కార్మికులచే పని చే యించడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈనెల 29న జ రిగే రక్షణ కమిటీ సమావేశంలో ప్రమాదాలపై యాజమాన్యాన్ని నిలదీస్తామ న్నారు. సింగరేణి స్థాయి, ఏరియా స్థాయి వరకు రక్షణ కమిటీలు వేయాలని, గ నులవారీగా వేసే కమిటీలలో యూనియన్లకు అతీతంగా సీనియర్‌ కార్మికుల ను, అనుభవజ్ఞులైన వారికి కమిటీలో స్థానం కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. బూరుగుల రాములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మెండె శ్రీని వాస్‌, సానం రవి, శివరాంరెడ్డి, ప్రవీణ్‌, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:53:40+05:30 IST