ఉరేసుకుని అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-21T02:36:56+05:30 IST

ఇంట్లో ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ గన్నేరువరం ఫణికుమార్‌(31) గురువారం

ఉరేసుకుని అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ ఆత్మహత్య
ప్యానుకు ఉరేసుకుని వేలాడుతున్న ఫణికుమార్‌

కావలి రూరల్‌, జనవరి20: ఇంట్లో ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకుని అసిస్టెంట్‌ పోస్టుమాస్టర్‌ గన్నేరువరం ఫణికుమార్‌(31) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గురువారం కావలి వెంగశరావునగర్‌లో  జరిగింది. పోలీసులు, మృతుడి భార్య ఉషారాణి  కథనం మేరకు, ప్రకాశం జిల్లా ఒంగోలు హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఫణికుమార్‌ ప్రకాశం జిల్లా పెద్దపవనిలో అసిస్టెంట్‌ పోస్టుమార్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య కలిగిరి మండలం గుడ్లదొనలో మహిళాపోలీస్‌గా పని చేస్తున్నది. వీరు తమ ఇద్దరు పిల్లలతో కలిసి వెంగళరా వునగర్‌లో నివాసం ఉంటున్నారు. ఫణికుమార్‌ గతంలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారంతోపాటు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టు బడులు పెట్టి రూ. 20 లక్షలు అప్పులు చేసినట్లు వారు తెలిపారు. మృతుడి  మానసికస్థితి సరిగాలేక గతంలో కూడా ఒంగోలులో మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్యాయ త్నానికి పాల్పడినట్లు తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యగులు కావటంతో కుమార్తెను పాఠశాలలో, కుమారుడి ని చైల్డ్‌కేర్‌ సెంటర్‌లో వదిలివెళ్లేవారు. గురువారం ఉదయం పిల్లలను స్కూల్‌లో వదిలి డ్యూటీకి వెళ్లమని భర్తకు చెప్పి ఉషారాణి డ్యూటీకి వెళ్లింది. ఇంట్లో పిల్లలతో ఉన్న ఫణికుమార్‌ తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. దీంతో పిల్లలు ఏడుపులు విని స్థానికులు కిటికీలో నుంచి చూడగా ఉరివేసుకుని ఉండటంతో పోలీసు లకు సమాచారం ఇచ్చారు. రెండవ పట్టణ సీఐ మల్లికా ర్జునరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏఎస్‌ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




Updated Date - 2022-01-21T02:36:56+05:30 IST